ఏపీ సీఐడీ అధికారులు... తనను చిత్రహింసలకు గురిచేశారంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సహచర ఎంపీలకు రాసిన లేఖలతో ఆయనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా పూరీ పార్లమెంట్ ఎంపీ, బిజూ జనతా దళ్ పార్లమెంటరీ పార్టీ నేత పినాకిమిశ్రా ఎంపీ రఘురామ పట్ల సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును ఖండించారు. గాయాలతో కూడిన ఫొటోలు దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని కోరారు.
ఏపీ సీఐడీ అధికారుల తీరు సరిగాలేదు..: బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు
ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ అధికారుల తీరును బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా ఖండించారు. ఎంపీతో ఇలా ప్రవర్తించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించి, బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు
అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్, మాండ్య ఎంపీ సుమలత, కేరళ ఎంపీ ప్రేమచంద్రన్, మరో ఒడిశా ఎంపీ చంద్రశేఖర్ సాహు తదితరులు... ఎంపీ రఘురామ పట్ల ఏపీ సీఐడీ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. ఒక పార్లమెంటేరియన్ పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదని.. పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.
కరోనా కట్టడికి విపక్ష నేతల సూచనలు ఎందుకు తీసుకోలేదు?: సోము వీర్రాజు
Last Updated : Jun 6, 2021, 10:58 PM IST