మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ప్రభుత్వం కసరత్తు
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. న్యాయ, సాంకేతికపరమైన అడ్డంకులు రాకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. సీఆర్డీఏ చట్టం రద్దును ఆర్థిక బిల్లుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. న్యాయ, సాంకేతికపరమైన అడ్డంకులు రాకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. సీఎం జగన్‌తో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే ఏపీ కేబినెట్ సమావేశం షెడ్యూల్ రెండుసార్లు మారింది. సీఆర్డీఏ చట్టం రద్దును ఆర్థిక బిల్లుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక బిల్లుగా శాసనసభలో కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ ఆమోదం అవసరం ఉంటుంది. ఇందుకోసమే కేబినెట్‌ను ముందస్తుగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ అంశాలపై ముఖ్యమంత్రితో సమావేశమై నేతలు చర్చించారు.