ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజల భాగస్వామ్యంతో ఎయిడ్స్​ మహమ్మారికి ముగింపు' - ఏపీ గవర్నర్​ తాజా వార్తలు

ఎయిడ్స్​కు​ వ్యతిరేకంగా ప్రతి ఏటా డిసెంబర్ ఒకటిన సాగించే పోరాటంలో... ప్రజలందరూ ఏకం కావాలని గవర్నర్​ పిలుపునిచ్చారు.

'ప్రజల భాగస్వామ్యంతో ఎయడ్స్​ మహమ్మారికి ముగింపు'
'ప్రజల భాగస్వామ్యంతో ఎయడ్స్​ మహమ్మారికి ముగింపు'

By

Published : Nov 30, 2019, 11:57 PM IST

ఎయిడ్స్​ మహమ్మారికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో... ప్రజలంతా ఏకం కావాలని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. ప్రజల్లో హెచ్​ఐవీ లక్షణాల పట్ల అవగాహన పెంచడానికి... వ్యాధితో మరణించినవారికి సంతాపం తెలిపేందుకే ఏటా డిసెంబర్ ఒకటిన అంతర్జాతీయ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 'ప్రజల భాగస్వామ్యంతో ఎయిడ్స్ మహమ్మారికి ముగింపు'గా ఈ ఏడాది ఎయిడ్స్​ దినోత్సవ లక్ష్యమంటూ పేర్కొన్నారు. వ్యాధి నివారణలో సమాజానిదే కీలకపాత్ర అని తన సందేశంలో తెలిపారు. ఎయిడ్స్‌ రోగుల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాలని... వ్యాధిగ్రస్థులపై వివక్ష చూపించకుండా మానసిక స్థైర్యం పెంచడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details