ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరత తక్షణనే పరిష్కరించండి' - విద్యాశాఖ అధికారులతో గవర్నర్​ సమావేశం

ఉన్నత ప్రమాణాలతో ముందడుగు వేసినప్పుడే సమాజం మంచి అభివృద్ధిని సాధించగలుగుతుందని గవర్నర్​ తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కలిపించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

'విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరతను తక్షణనే పరిష్కరించండి'
'విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరతను తక్షణనే పరిష్కరించండి'

By

Published : Dec 21, 2019, 9:15 AM IST

విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. రాజ్ భవన్‌ దర్బార్‌హాలులో వర్సిటీల ఉపకులపతులతో సమీక్ష నిర్వహించారు. విద్యారంగం ఒక్కటే సమాజ గతిని మార్చగలదన్న గవర్నర్‌... ఉన్నత ప్రమాణాలతో ముందడుగు వేసినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్యలో పరిమాణాత్మక, గుణాత్మక మెరుగుదల కోసం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ప్రదర్శించిన నిబద్ధత ప్రశంసనీయమని కొనియాడారు. యువతకు డిగ్రీ పట్టాలిచ్చి వారిని నిరుద్యోగులుగా చేయకుండా... వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కలిపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

'విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరతను తక్షణనే పరిష్కరించండి'
'విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరతను తక్షణనే పరిష్కరించండి'

ABOUT THE AUTHOR

...view details