ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింది: గవర్నర్ బిశ్వభూషణ్ - famous sprinter milka singh death

స్ప్రింట్‌ దిగ్గజం మిల్కాసింగ్ మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాంటి విశిష్ట క్రీడాకారుడిని దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింది : గవర్నర్ బిశ్వభూషణ్
దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింది : గవర్నర్ బిశ్వభూషణ్

By

Published : Jun 19, 2021, 9:54 AM IST

స్ప్రింట్‌ దిగ్గజం మిల్కాసింగ్ మృతిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిల్కాసింగ్ వ్యక్తిత్వం భావి త‌రాల‌కు ఆద‌ర్శమని కొనియాడారు. దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింద‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచ అథ్లెటిక్స్​లో చెర‌గ‌ని ముద్ర వేశారని, కామన్వెల్త్ క్రీడల్లో వ్యక్తిగత అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్ మిల్కా సింగ్ అని గవర్నర్ కొనియాడారు. మిల్కా సింగ్ కుటుంబసభ్యులకు గవర్నర్ హరిచందన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details