ప్రధానంగా ఈ అభియోగాలతోనే కేసులు
- సీఆర్‌పీసీ సెక్షన్ 144, భారత పోలీసు చట్టం సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నా వాటిని ఉల్లంఘిస్తూ ర్యాలీలు, పాదయాత్రలు, ప్రదర్శనల్లో పాల్గొన్నారని..
- పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించటం, వారిపై దాడి చేయటం, వారిని కించపరిచేలా నకిలీ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని..
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, రాస్తారోకోతో రాకపోకలకు అంతరాయం కలిగించారని..
- అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారని..
- ముందస్తుగా నిర్బంధించకపోతే నేరానికి పాల్పడే అవకాశముందని..
- అనుమతులు లేని సభలు, ర్యాలీల్లో పాల్గొనేందుకు ప్రయత్నించారని..
- సీఆర్‌పీసీ సెక్షన్ 154
- నేరం చేసే అవకాశముందన్న ఉద్దేశంతో ముందస్తు నిర్బంధం ఐటీ చట్టంలోని పలు సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి.
ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారంటే
ఐపీసీ సెక్షన్
143 చట్టవిరుద్ధంగా ఒక చోట గుమిగూడటం
188 ప్రభుత్వోద్యోగి ఆదేశాలను ఉల్లంఘించటం
324 ప్రమాదకరమైన ఆయుధంతో తీవ్రంగా గాయపరచటం
341 అడ్డగించటం
353 ప్రభుత్వోద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించటం
469 ప్రతిష్ఠను దెబ్బతీయటం కోసం ఫోర్జరీ
465 ఫోర్జరీ
120 బీనేరపూరిత కుట్ర
505 తప్పుడు సమాచారాన్ని ప్రచురించటం, వ్యాప్తి చేయటం
506 నేరపూరిత బెదిరింపు
కేసులు ఇలా పెట్టారు
అనంతవరం గ్రామానికి చెందినవారు విజయవాడ దుర్గగుడికి పాదయాత్రగా వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పాదయాత్రకు సంబంధించి తుళ్లూరు, బోరుపాలెం, వెలగపూడిలలోనూ పలువురిపై కేసులు నమోదుచేసి అరెస్టుచేశారు.
తార్కాణాలెన్నో!
- ఎన్‌హెచ్-16ను దిగ్బంధించారనే ఆరోపణలతో 18 మందిపై కేసుపెట్టారు. కుట్ర కోణం, ఉద్యోగులను అడ్డగించటం వంటి అభియోగాలు మోపారు.
- ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి కేసులో వందమందిని నిందితులుగా చేర్చారు.
- రాజధాని గ్రామాల నుంచి విజయవాడ దుర్గగుడికి పాదయాత్రగా బయల్దేరిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతులు లేవంటూ తుళ్లూరు పోలీసుస్టేషన్‌లోనే వందమందికి పైగా వ్యక్తులపై కేసులు పెట్టారు.
- అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలన్న డిమాండుతో జనవరి 10న విజయవాడలో నిర్వహించిన ప్రదర్శనకు సంబంధించి 479 మంది మహిళలపై కేసు నమోదుచేశారు.
- ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నందుకు 100 మందిపై కేసులు నమోదుచేసి, 15 మందిని అరెస్టు చేశారు.
- బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను అడ్డుకున్న అభియోగంతో పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారు.
- మీడియా ప్రతినిధులపై దాడి చేశారంటూ 100 మందిపై కేసు పెట్టారు.
- కృష్ణాయపాలెంలో దుగ్గిరాల తహసీల్దార్ మల్లీశ్వరిని అడ్డుకున్నారని 428మందిపై కేసులు పెట్టారు.
- మందడంలో డ్రోన్ కెమెరాల ధ్వంసం, రాస్తారోకో చేసినందుకు 100 మందిపై కేసులు పెట్టారు.
ఒక్కొక్కరిపై అనేక కేసులు
అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనేవారు, నాయకత్వం వహిస్తున్న వారినే ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరిని నాలుగైదు కేసుల్లో నిందితులుగా చేర్చారన్నారు.
చాలాకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఒకరి పేరు ప్రస్తావించి.. ఇతర నిందితులు 20 మంది, 30 మంది అని పేర్కొంటున్నారు.
ఇదీచదవండి
'ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదు'