తుపాను దృష్ట్యా ఆక్సిజన్ నిల్వ, తయారీపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలకు సిద్ధమైంది. యాస్ తుపాను ప్రభావం 5 రాష్ట్రాలపై ఉంటుందని కేంద్రం హెచ్చరికలు జారీ చేయగా... రేపటికల్లా రూర్కెలా, ఒడిశా నుంచి 100 మిలియన్ టన్నుల ఆక్సిజన్ సమీకరణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అంగుల్, కరీంనగర్, రవుర్కెలా నుంచి ట్యాంకర్ల తరలింపునకు ఏర్పాట్లు చేసింది.
తుపాను దృష్ట్యా ఆక్సిజన్ నిల్వ, తయారీపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ.కృష్ణబాబు ఆదేశించారు. తుపాను దృష్ట్యా ఆక్సిజన్ నిల్వ, తయారీపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. అంగుల్, కరీంనగర్, రూర్కెలా నుంచి ట్యాంకర్ల తరలింపునకు ఏర్పాట్లు చేసింది. యాస్ తుపాను ప్రభావం 5 రాష్ట్రాలపై ఉంటుందని కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
విశాఖ పోర్టుకు 120 టన్నుల ఎల్‌ఎంవో ట్యాంకర్లను ఐవోసీ పంపింది. 120 టన్నుల ఆక్సిజన్‌ను గుంటూరు, తిరుపతిలో నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, ఈఐఎల్, లిక్వినాక్స్‌కు నిరంతర విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఎం.టి.కృష్ణబాబు ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనరేటర్లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది: ఏకే సింఘాల్