ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Holidays in 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులివే! - telangana todays news

Government Of Telangana Holiday List 2022: 2022వ సంవత్సరంలో 28 రోజుల సాధారణ సెలవులతో పాటు.. 23 ఐచ్చిక సెలవులు.. 23 వేతనంతో కూడిన సెలవుల (Holidays in 2022)పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు (Telangana Government Holiday List 2022) జారీ చేసింది. పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేసింది.

government-of-telangana-holiday-list-2022
తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులివే!

By

Published : Nov 27, 2021, 9:10 AM IST

Government Of Telangana Holiday List 2022: తెలంగాణలో 2022 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవుల (holidays in 2022)పై రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government Holiday List 2022) ఉత్తర్వులు (జీవో నంబరు 2618, 2619) జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు 28 రోజులను సాధారణ సెలవులుగా, మరో 23 రోజులను ఐచ్ఛిక సెలవులు (2022 Public Holiday list )గా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌) 23గా నిర్ధారిస్తున్నట్లు శుక్రవారం ఉత్వర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు గాక అయిదు ఐచ్ఛిక సెలవులను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రంలోని పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తించవని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు సెలవులపై విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చూడండి:

Rain alert: రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రకు మరోసారి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details