ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్య సిబ్బంది నిర్వాకం: సెలైన్​ బాటిల్​తో కారు శుభ్రం - car with saline bottle in huzurabad area hospital today

మామూలుగా సెలైన్ బాటిల్​ను రోగులకు ఎక్కించి చికిత్స అందించడం మనం చూశాం. కానీ ఇక్కడ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఎక్కించే సెలైన్​ బాటిళ్లను సాక్షాత్తూ వైద్య సిబ్బందే వృథా చేస్తున్నారు. ఎంచక్కా.. తమ కార్లను శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో సెలైన్​తో కారు తుడుస్తున్న సంఘటన జరిగింది.

సెలైన్​ బాటిల్​తో కారు శుభ్రం
సెలైన్​ బాటిల్​తో కారు శుభ్రం

By

Published : Mar 23, 2021, 10:43 PM IST

రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ బాటిళ్లను కారు తుడిచేందుకు వినియోగిస్తున్నారు ప్రభుత్వ వైద్య సిబ్బంది. అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే సెలైన్‌ను సాక్షాత్తూ వైద్య సిబ్బందే వృథా చేస్తున్నారు. ఇదేంటని అడిగితే అది ఖాళీ సీసాలో నీళ్లు నింపామని బుకాయిస్తున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో జరిగింది.

కాయకల్ప కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్​లోని ఏరియా ఆస్పత్రిని రంగులతో తీర్చిదిద్దుతున్నారు. గోడలకు సున్నం వేస్తుండగా అక్కడే ఉన్న ఆస్పత్రి ఏవో డాక్టర్‌ ప్రత్యూష కారుపై పడింది. ఇది గమనించిన వైద్యురాలు తన కారును తుడుచుకునే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న సిబ్బంది నీటితో తుడువాల్సిన కారును ఏకంగా రోగికి ఎక్కించాల్సిన సెలైన్‌ బాటిల్​తో తుడిచారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న రోగులు చరవాణిలో చిత్రీకరించారు.

కేవలం ప్రథమ చికిత్సలే:

రోగులకు ప్రథమ చికిత్సలు మాత్రమే అందించి వరంగల్‌ ఎంజీఎంకు పంపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏ చిన్న ప్రమాదం జరిగినా వరంగల్‌కు రెఫర్‌ చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటితోనే కడిగాం: సూపరింటెండెంట్

ఖాళీ సెలైన్‌ బాటిల్​ను నీటితో నింపి కారును తుడిచారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేశ్‌ చెబుతున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతేనే వరంగల్‌ ఎంజీఎంకు రెఫర్‌ చేస్తున్నామన్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

అరుగుపై కూర్చున్నట్లు నటిస్తారు.. ఇళ్లల్లోకి చొరబడి కాజేస్తారు!

ABOUT THE AUTHOR

...view details