తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. 48 గంటల తర్వాత స్వగృహంలో కూర్చొని జూమ్ మీటింగ్‌ల్లో మాట్లాడటం తప్ప చేసేదేం లేదని ఎద్దేవా చేశారు. కడపలో మాట్లాడిన ఆయన...3 ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచామని చెప్పారు. చంద్రబాబుని ప్రజలు నమ్మే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు.
అమరావతిలో రాజధాని పేరిట పది వేల కోట్ల అవీనితికి పాల్పడ్డారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాము ఎన్నికలకు సిద్ధమని సవాల్ విసిరారు. మళ్లీ ఎన్నికలు వస్తే చంద్రబాబుకు కుప్పంలో మెజార్టీ కూడా రాదని జోస్యం చెప్పారు.