Rajasingh Arrest: అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులపై పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం భారీఎత్తున పోలీసులు షాహినాయత్‌గంజ్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఇంటికి వెళ్లే దారిలోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు - హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
15:31 August 25
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజాసింగ్‌కు ఇప్పటికే నోటీసులు జారీ
రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడీషీట్ తెరిచారు. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటుచేసుకునేలా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 22న ఓ వర్గాన్ని కించపరిచేలా పెట్టిన వీడియో శాంతిభద్రలకు విఘాతం కలిగించిందని పేర్కొన్నారు. ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని మీడియాకు తెలిపారని పేర్కొన్నారు. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని.. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని సీపీ తెలిపారు. వ్యాపార సముదాయాలూ మూతపడ్డాయన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. 18 కమ్యూనల్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడీషీట్. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. మత ఘర్షణలు చోటుచేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు ఉంటున్నాయి. ఈ నెల 22న రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించింది. ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నాం. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజాసింగ్ మీడియాకు ప్రకటించారు. మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. వీడియో కారణంగానే నిరసనలు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. 2004 నుంచి ఇప్పటి వరకు రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్‌పై 18 కమ్యూనల్ కేసులు నమోదయ్యాయి.- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
మొన్న అరెస్టు.. అదేరోజు విడుదల..:తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం రాత్రి ఓ వీడియోను చిత్రీకరించి, తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం.. పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయనను మంగళవారం అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కోర్టు ఆయనకు ముందుగా నోటీసులు జారీ చేయనందున రిమాండ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. రాజాసింగ్‌ను విడుదల చేసింది. ఇవాళ పాత కేసులో పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఇవీ చదవండి: