ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోవులను కబేళాలకు తరలిస్తుండగా పట్టుకున్న రాజాసింగ్ - telangana news

ఆవులను అక్రమంగా తరలిస్తోన్న ఓ వాహనాన్ని తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ అడ్డగించారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​కు 45 గోవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

goshamahal-mla-raja-singh-saved-cows-transport-of-slaughterhouse-in-shamshabad
గోవులను కబేళాలకు తరలిస్తుండగా పట్టుకున్న రాజాసింగ్

By

Published : Dec 22, 2020, 2:16 PM IST

కబేళాలకు ఆవులను తరలిస్తోన్న ఓ వాహనాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​కు 45 గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించారు. పట్టుబడిన ఆవులను గోశాలకు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆవులను కబేళాలకు తరలిస్తున్న వారికి పోలీసులు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గోరక్షణ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. అక్రమంగా గోవులను తరలిస్తుంటే పోలీసు శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details