రాష్ట్రాభివృద్ధితో పాటు రాజధాని అంశంపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ.. నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన సభ్యులు.. నివేదికకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించామని నిపుణుల కమిటీ తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సుమారు 38 వేలకుపైగా సూచనలు వచ్చాయని తెలిపారు. రెండు అంశాల ఆధారంగా నివేదిక రూపొందించామని కమిటీ తెలిపింది. సహజ వనరుల, పర్యావరణానికి అనుగుణంగా సూచనలు ఇచ్చామని స్పష్టం చేసింది. సహజ వనరులు అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించేలా అధ్యయనం చేశామని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే ఆయా ప్రాంతాల్లో ఎలా మౌలిక వనరుల అభివృద్ధి అవుతాయనే అనే కోణంలో అధ్యయనం సాగిందని తెలిపారు.
నిపుణుల కమిటీ చేసిన సూచనలు
- నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు సిఫార్సు
- ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమగా విభజన
- శాసన రాజధానిగా అమరావతి
- కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో పాటు అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
- విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం
మరింత అభివృద్ధి చేయవచ్చు..