girl dead body found: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్యంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక శవమై తేలింది. బాలిక తల్లి చెప్పిన వివరాల ప్రకారం...ఉదయం రోజులానే బాలిక టాయిలెట్ కోసం బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఎంతకీ కుమార్తె ఇంటికి రాకపోవడంతో... చుట్టుపక్కల వెతికారు. చిట్యంపల్లి శివార్లలో బాలిక బట్టలు లేకుండా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెల్లవారుజామున బయటకు వెళ్లిన బాలికపై అత్యాచారం.. ఆపై హత్య? - girl rape in vikarabad district
girl dead body found: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా చిట్యంపల్లిలో దారుణం జరిగింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్యంపల్లిలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక శవమై తేలింది.
బాలికపై అత్యాచారం
బాలిక తలపై స్వల్ప గాయం ఉంది. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామంలో నాని అనే యువకుడికి, బాలికకు మధ్య ప్రేమ ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నివేదిక వచ్చాక స్పష్టత రానుంది.