ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో కరోనా విజృంభణ - corona virus

గ్రేటర్ హైదరాబాద్​లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రేటర్​లో రెండో తేదీ వరకు కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు 363 ఉండగా.. నిన్న ఒక్కరోజే 20 పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఇక కేసులు పెరుగుతుండడంతో పాటు ఇటూ కంటైన్మెంట్ జోన్లు కూడా పెంచుతున్నారు అధికారులు. బల్దియా పరిధిలో రెండో తేదీ వరకు 115 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ ప్రతిరోజు వైద్య పరీక్షలతో పాటు.... నిరంతరం రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఇందులో చార్మినార్ జోన్​లో అత్యధికంగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి జోన్​లో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు.

గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో కరోనా విజృంభణ
గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో కరోనా విజృంభణ

By

Published : May 5, 2020, 6:25 AM IST

గ్రేటర్ హైదరాబాద్​లో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో అవుతున్న కేసుల్లో సగం వరకు హైదరాబాద్​లోనే నమోదు కావడం వల్ల బల్దియా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కంటైన్మెంట్​ జోన్లతో కరోనాను నివారించేందుకు జీహెచ్ఎంసీ పలు చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా కంటైన్మెంట్​ జోన్లలో రెండు సార్లు శానిటైజ్ చేసి... ఇంటింటికి వైద్య సిబ్బంది తిరుగుతూ ఆరోగ్య స్థితిని చూస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఎమర్జెన్సీ బృందాలు 24 గంటల పాటు కంటైన్మెంట్​ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇక హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనికి రోజుకు వందల సంఖ్యలో భారీగా ఫోన్లు వస్తున్నాయి.

ఇక గ్రేటర్ పరిధిలో జోన్ల వారిగా చూసుకుంటే...

ఎల్బీ నగర్ జోన్​లో మొత్తం 17 కరోనా పాజిటివ్ కేసులు ఉండడం వల్ల 15 కంటైన్మెంట్​ జోన్లు ఏర్పాటు చేశారు.

ప్రాంతంపేరు కరోనా పాజిటివ్​ కేసులు కంటైన్మెంట్​ జోన్లు
కాప్రాసర్కిల్​ 4 4
ఉప్పల్​ సర్కిల్​ 4 4
హయత్​నగర్​ సర్కిల్​ 1 1
ఎల్బీ నగర్​ సర్కిల్​ 5 4
సరూర్​నగర్​ సర్కిల్​ 3 2

చార్మినార్ జోన్​ లో 219 కరోనా పాజిటివ్ కేసులు, 50 కంటైన్మెంట్ జోన్లు అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి.

ప్రాంతం పేరు కరోనా పాజిటివ్​ కేసులు కంటైన్మెంట్​ జోన్లు
మలక్​పేట్​ సర్కిల్​ 55 10
సంతోష్​నగర్​ సర్కిల్​ 58 10
చాంద్రాయన్​ గుట్ట 25 6
చార్మినార్​ సర్కిల్​ 22 13
ఫలక్​నుమా సర్కిల్​ 56 10
రాజేంద్రనగర్​ సర్కిల్​ 3 1

ఖైరతాబాద్ జోన్​లో కరోనా పాజిటివ్ కేసులు 82, కంటైన్మెంట్ జోన్లు 32 ఉన్నాయి.

ప్రాంతం పేరు కరోనా పాజిటివ్​ కేసులు కంటైన్మెట్​ జోన్లు
మెహిదీపట్నం సర్కిల్​ 58 15
కార్వాన్​ సర్కిల్​ 8 7
గోషామహల్​ సర్కిల్​ 9 5
ఖైరతాబాద్​ సర్కిల్​ 3 1
జూబ్లీహిల్స్​ సర్కిల్​ 4 4

సికింద్రాబాద్ జోన్​లో మొత్తం 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఇక్కడ 13 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.

ప్రాంతం పేరు కరోనా పాజిటివ్​ కేసులు కంటైన్మెట్​ జోన్లు
ముషీరాబాద్​ సర్కిల్​ 3 2
అంబర్​పేట్​ సర్కిల్​ 2 2
మల్కాజిగిరి సర్కిల్​ 6 4
సికింద్రాబాద్​ సర్కిల్​ 4 3
బేగంపేట సర్కిల్​ 2 2

కూకట్​పల్లి జోన్​లో 28 కరోనా పాజిటివ్ కేసులు, 5 కంటైన్మెంట్​ జోన్లు ఉన్నాయి.

ప్రాంతం పేరు కరోనా పాజిటివ్​ కేసులు కంటైన్మెంట్​ జోన్లు
మూసాపేట్​ సర్కిల్​ 4 1
కూకట్​పల్లి సర్కిల్​ 3 0
కుత్బుల్లాపూర్​ సర్కిల్​ 4 0
గాజులరామారం సర్కిల్​ 12 3
అల్వాల్​ సర్కిల్​ 5 1

ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details