వంట గ్యాస్ ధరలు నెల వ్యవధిలోనే రూ.100 వరకు పెరిగాయి. విజయవాడలో గృహ వినియోగ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ.716 నుంచి రూ.740 మధ్య ఉండగా.. వాణిజ్య సిలిండర్ ధర (19 కిలోలు) రూ.1,430 పైనే ఉంది. వంట గ్యాస్ ధరలను సాధారణంగా ప్రతినెలా ఒకటో తారీఖున సవరిస్తుంటారు. అయితే డిసెంబరులో ఇప్పటికే రెండుసార్లు పెంచారు. ఇటీవల గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.36.50 చొప్పున పెంచారు. రాష్ట్రంలో వంటగ్యాస్ కనెక్షన్లు మొత్తం 1.38 కోట్ల వరకు ఉండగా.. ఇందులో 1.15 కోట్ల వినియోగదారులు ప్రతి నెలా సిలిండర్లు తీసుకుంటున్నారు. నెలకు రూ.100 పెంపు ప్రకారం లెక్కించినా ఈ భారం రూ.115 కోట్ల వరకు ఉంది. కరోనా తర్వాత వ్యాపారాలు ఇంకా పుంజుకోని పరిస్థితుల్లో వాణిజ్య సిలిండర్ ధర పెంచడం దెబ్బ మీద దెబ్బగా తోపుడు బండ్ల వ్యాపారులు వాపోతున్నారు.
తగ్గుతున్న నగదు బదిలీ: