ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడంటే..? - మేడ్చల్​ జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం

Gang rape of a woman: సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు వచ్చినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో మహిళపై అర్ధరాత్రి సామూహిక అత్యాచారం చేశారు. మానవత్వం మరిచి మృగాళ్లలా మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

Gang rape of a woman
మహిళపై సామూహిక అత్యాచారం

By

Published : Apr 30, 2022, 1:19 PM IST

Updated : Apr 30, 2022, 3:12 PM IST

Gang rape of a woman: షోలాపూర్ నుంచి రెండ్రోజుల క్రితం దుండిగల్‌కు ఓ మహిళ వచ్చింది. ఆమె వయసు సుమారుగా 30 సంవత్సరాలు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఆమెపై కన్నేశారు ఓ నలుగురు మృగాళ్లు. గండిమైసమ్మలోని బార్ వెనక ఖాళీ ప్రదేశంలోకి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. మహిళపై నరసింహ(23), ఇమామ్(20), కుద్దుస్(21), ఉమృద్ధిన్(21) అనే నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ నలుగురు యుక్త వయసు గలవారే కావడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దుండిగల్ పీఎస్ ఎదురుగా ఉండే బస్తీవాసులుగా గుర్తించారు. వీరంతా ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Apr 30, 2022, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details