రాష్ట్రంలో ఘనంగా గాంధీజీ 150వ జయంతి - gandhi 150th birthday celebrations in ap
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు పాల్గొని మహాత్మునికి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి.చిత్తూరు జిల్లా పుత్తూరు డిగ్రీ కళాశాలలో వేడుకలకు ఎమ్మెల్యే రోజా హాజరై మహాత్మడి విగ్రహానికి నివాళులర్పించారు.మంత్రి శంకరనారాయణ...అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నర్వహించి గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.కలెక్టరేట్‌లో బాపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.కర్నూలు కలెక్టరు కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ వీరపాండియన్,ఎమ్మెల్యే కార్యాలయ అధికారులు నివాళులర్పించారు.తెదేపా కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నివాళులర్పించారు.ప్రకాశం జిల్లా చీరాలలోని నల్లగాంధీ కూడలిలో ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కరణం బలరాం నివాళులర్పించారు.గుంటూరు జిల్లా తెనాలి గాంధీ పార్క్‌లోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాళులర్పించారు.తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిగ్గిరెడ్డి....ఆలమూరులో గాంధీ చిత్రపటానికి అంజలి ఘటించారు.