తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గణపతి ఉత్సవాలు ప్రజలకు సంతోషం కలిగిస్తుంటే... విగ్రహాల కొనుగోలు మాత్రం చుక్కలు చూపిస్తోంది. పట్టణంలో వేడుకలకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. విగ్రహం బరువుకంటే ధరలే అధికంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తయారీదారులను ఇదేంటని ప్రశ్నిస్తే గతంలో కంటే ధరలు పెరిగాయని, జీఎస్టీ అధిక భారమైందని సమాధానమిస్తున్నారు. విగ్రహాలు కొనాలంటేనే బెంబేలెత్తుతున్నారు.
బెంబేలెత్తిస్తున్న గణపతి విగ్రహాల ధరలు - ganapathi vigrahalu
గణపతి ఉత్సవాలకు యువత సిద్ధమవుతోంది. విగ్రహాల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కొనుగోలు చేయాలంటేనే నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు.
బెంబేలెత్తిస్తున్న గణపతి విగ్రహాల ధరలు