ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గల్లా ఫుడ్స్ భూమిని వెనక్కి తీసుకునేలా ఆదేశించండి...హైకోర్టులో వ్యాజ్యం - గల్లా ఫుడ్స్ ప్రధాన వార్తలు

భూముల విక్రయ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు గల్లా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకునేలా ఏపీఐఐసీని ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా నల్లగట్లపల్లికి చెందిన జి.పురుషోత్తంనాయుడు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Sep 4, 2021, 3:32 AM IST

భూముల విక్రయ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు గల్లా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకునేలా ఏపీఐఐసీని ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా నల్లగట్లపల్లికి చెందిన జి.పురుషోత్తంనాయుడు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ. దుర్గాప్రసాదరావు ... వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐఐసీ సీఎండీ, ఏపీఐఐసీ ప్రాంతీయ మేనేజరు, గల్లా ఫుడ్స్ లిమిటెడ్​కు నోటీసులు జారీచేశారు.

కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పరిధిలోని తేనాపల్లి, పేట అగ్రహారం గ్రామాల పరిధిలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కోసం సంబంధిత సంస్థ 2011 నవంబర్​లో 28 ఎకరాల్ని ఏపీఐఐసీ నుంచి పొందిదని పిటిషనర్ పేర్కొన్నారు . ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు.

ఇదీ చదవండి:

MAA Elections: ప్రకాశ్​రాజ్ ప్యానెల్​లోకి జీవిత, హేమ

ABOUT THE AUTHOR

...view details