ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2021, 9:23 PM IST

ETV Bharat / city

GANJAI: రెండేళ్లుగా రూ.కోటికి పైగా గంజాయి రవాణా.. చివరికి ?

రెండేళ్లుగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను తెలంగాణలోని భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్టాండ్​ సమీపంలో నలుగురిని అరెస్ట్​ చేసి, వారి నుంచి రూ. 6 లక్షల గంజాయి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

GANJAI
గంజాయి సరఫరా చేస్తున్న మఠా అరెస్ట్

రెండేళ్లలో సుమారు కోటి 30 లక్షల విలువ చేసే గంజాయి సరఫరా చేసిన ముఠాను తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీసులు అరెస్ట్‌ చేశారు. బస్టాండ్‌ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా... నలుగురు అనుమానాస్పదంగా కనిపించటంతో విచారించారు. వారి వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా... అందులో గంజాయి గుర్తించారు. మరి కొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు ఖమ్మం వాసులు కాగా.. ఒకరు ఏపీకి చెందిన వారు ఉన్నారు.

నిందితుల నుంచి దాదాపు ఆరు లక్షల విలువ చేసే 40 కేజీల గంజాయితో పాటు ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కొర్రా ధారబాబు అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితో పాటు మరో నలుగురు ఒక ముఠాగా ఏర్పడి సుమారు రెండు సంవత్సరాల నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అతనిపై భద్రాచలం పోలీసు స్టేషన్లో 8 కేసులున్నాయని ఏఎస్పీ వినీత్‌ తెలిపారు.

ముత్తినేని కిషన్ కుమార్ అనే వ్యక్తి వీరికి ఆర్థిక సాయం చేస్తూ గంజాయిని ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనిపై కూడా 4 కేసులు నమోదై ఉన్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. వీరందరిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న వారికోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఏఎస్పీ వినీత్ తెలిపారు.

ఇదీ చదవండి:

బోర్​వెల్​ నిర్వాహకుల నిర్లక్ష్యం... 12 ఏళ్ల బాలుడు మృతి

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రెట్టింపు వృద్ధి

ABOUT THE AUTHOR

...view details