టిక్‌టాక్ లోని ఫేక్ వీడియోలను ఫాలో అయి...ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అస్వస్థతకు గురైన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల పరిధిలో జరిగింది. ఉమ్మెత్త విత్తనాలను తింటే కరోనా రాదన్న వీడియో చూసి ప్రయత్నం చేశారు. విత్తనాలను తినడంతో స్పృహ కోల్పోయారు. స్థానికులు వారిని చీమకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మెత్త విత్తనాలు తిన్నారు..ఆస్పత్రి పాలయ్యారు - danger with datura seeds news
టిక్ టాక్‌లోని కొన్ని వీడియోలను ఫాలో అయ్యింది ఓ కుటుంబం. అంతేనా మరో అడుగుముందుకేసి ప్రయత్నం కూడా చేసింది. ఇప్పడు అదే వారి ప్రాణాలమీదికి తెచ్చింది. నలుగురు వ్యక్తులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
datura seeds in prakasham district