Skill Development Corporation case: స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ సీఈవో గంటా సుబ్బారావుకు బెయిల్ - ap news
13:25 December 20
స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ సీఈవో గంటా సుబ్బారావుకు బెయిల్
Skill Development Corporation case: స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ సీఈవో గంటా సుబ్బారావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ పోలీసులకు సుబ్బారావు అందుబాటులో ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి శనివారం ఉ.10 నుంచి మ.1 వరకు అందుబాటులో ఉండాలని సూచించింది. సుబ్బారావును విచారించాలనుకుంటే ఒకరోజు ముందుగా సీఐడీ నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో రూ.241 కోట్లు మేర నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో సంస్థ మాజీ సీఈవో, ఎండీ గంటా సుబ్బారావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం గంటా సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి: