ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏదో ఒకటి అనుకుంటే... అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటమే! - food that should be avoided with empty stomach

ఇంటిపనుల్లో నిమగ్నమై, ఉదయం విధులకు వెళ్లాలనే హడావుడిలో ఏదో ఒక అల్పాహారం తినేస్తాం. ఐతే పరగడుపున తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి.  అవి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడదాం.

good break fast
బ్రేక్​ఫాస్ట్

By

Published : Apr 20, 2021, 8:18 AM IST

కొందరు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటుంటారు. కొన్ని సమయాల్లో కొన్ని పదార్థాలు తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇలా పరిగడుపున తినకూడని పదార్థాలేంటంటే..

  • ఉదయాన్నే స్వీట్స్‌ తినకూడదు. ఖాళీ కడుపుతో తృణ ధాన్యాలనూ తీసుకోకూడదు. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముందుగా ఏదైనా తిన్న తర్వాత వీటిని తీసుకోవడం మంచిది.
  • పొద్దునే మాంసాహారం మంచిది కాదు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్‌, నైట్రేట్లు.. చర్మ సమస్యలకు కారణమవుతాయి.
  • పరగడుపున కారం, మసాలాలతో చేసిన ఆహారపదార్థాల జోలికి వెళ్లకూడదు. ఇవి ఎసిడిటీ సమస్యలను కలుగజేస్తాయి. వీటికి బదులుగా పండ్ల రసాలు, కూరగాయల సలాడ్‌ వంటివి తీసుకోవడం మంచిది.
  • పొద్దునే మైదా పిండితో చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రత్యామ్నాయంగా ఆవిరిపై ఉడికించే పదార్థాలను తీసుకుంటే త్వరగా జీర్ణమవడమే కాకుండా, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ABOUT THE AUTHOR

...view details