రాష్ట్ర సచివాలయంలో మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఒకటో బ్లాక్ వద్ద ఉండే భద్రతా సిబ్బందిలో ముగ్గురికి, ఒక డ్రైవర్‌తో పాటు మరో ఉద్యోగికీ.... వైరస్ సోకింది. వీరితో కలిపి ఇప్పటివరకూ సచివాలయ ఉద్యోగుల్లో సుమారు 35 మంది కరోనా బారినపడ్డారు.
సచివాలయంలో మరో ఐదుగురికి కరోనా - ఏపీ కొవిడ్ కేసులు
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతుంది. తాజాగా మరో ఐదుగురికి వైరస్ సోకింది. దీంతో ఇప్పటి వరకూ 35 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారు. కరోనా సోకిన ఉద్యోగులకు 28 రోజులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం సీఎస్‌ను కోరింది.
సచివాలయంలో మరో ఐదుగురికి కరోనా
కొవిడ్ బాధితులు ఆసుపత్రిలో 14 రోజులు, కోలుకున్నాక హోం క్వారంటైన్‌లో మరో 14 రోజులు ఉండాలి కాబట్టి...వారికి 28 రోజుల పాటు ప్రత్యేక సీఎల్ ఇప్పించాలని సీఎస్ నీలం సాహ్నీకి సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. కొవిడ్ పాజిటివ్ వచ్చినవారితో సన్నిహితంగా మెలిగిన వారికి 14 రోజుల పాటు ఇంటి నుంచే పనిచేసే సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.
ఇదీ చదవండి :దివిసీమ రైతులకు పసుపు కప్పల బెడద