Jubilee Hills Gang Rape Case :జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు పోలీసులు లైంగిక సామర్థ్య పరీక్షలు చేయించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లకు ఉస్మానియా ఆసుపత్రిలో ఈరోజు లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన తరువాత నిందితులను పీఎస్‌కు తీసుకొచ్చారు.
బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు పక్కా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగానే లైంగిక సామర్థ్య పరీక్షలు చేయించి వాటి వివరాలను పోలీసులు నేరాభియోగపత్రంలో దాఖలు చేయనున్నారు. అత్యాచారం జరిగిన సమయంలో మైనర్ బాలురు.. బాలికను గాయపర్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాలిక మెడతో పాటు శరీరంలో అక్కడక్కడ గోర్లతో రక్కిన గాయాలను వైద్యులు గుర్తించారు. ఈమేరకు వైద్యులు ఇచ్చిన నివేదికను పోలీసులు నమోదు చేసుకున్నారు.