ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మెుదటి కరోనా మరణం - కరోనా లక్షణాలతో రాష్ట్రంలో తొలి మరణం

తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నాంపల్లికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని పేర్కొన్నారు. వృద్ధుడి భార్య, కుమారుడు హోం క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు.

first corona death in telangana
తెలంగాణలో మెుదటి కరోనా మరణం

By

Published : Mar 28, 2020, 7:15 PM IST

ఈనెల 14న మతపరమైన కార్యక్రమం కోసం వృద్ధుడు దిల్లీ వెళ్లాడు. ఈనెల 17న తిరిగి వచ్చాడు. మార్చి 20న తీవ్ర జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది. సైఫాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. గురువారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే సమీప కార్పొరేట్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు.

-ఈటల రాజేందర్, మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈటల ప్రకటించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 65కి చేరిందని తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని చెప్పారు. క్వారంటైన్‌ వ్యక్తులు బయట తిరిగితే పోలీసులు జైలుకు పంపుతారని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు బాధ్యతాయుతంగా మెలగాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:ప్రకాశం సరిహద్దులో వేల మంది కూలీల అడ్డగింత

ABOUT THE AUTHOR

...view details