అనుకోని అగ్ని ప్రమాదం 20 విశ్వకర్మ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వారి జీవితాలను రోడ్డు పాలు చేసింది. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిన వారికి తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో వారి దుకాణాలు బుడిదైపోయాయన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది.
టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం... రోడ్డుపై పడ్డ 20 కుటుంబాలు - ఖమ్మంలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణలోని ఖమ్మంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో జరిగిన ప్రమాదంలో 80 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

fire-accident-in-khammam
టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం... రోడ్డుపై పడ్డ 20 కుటుంబాలు
ఖమ్మం నగరంలోని శ్రీనివాస నగర్లో సాయి టింబర్ డిపో సమీపంలోని దువ్వాడ మిషన్లు ఉన్న ప్రాంతంలో విద్యూత్ షార్ట్ సర్య్కూట్తో అగ్ని టేకు కలప కాలిపోయింది. సుమారు 80 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు ఈ మిషన్లు జీవనాధారమని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.