సచివాలయంలో వరుసగా రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు.. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల నిరనసలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలు నిర్వహించారు.
సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసన - secretariat employees protest news
సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
సచివాలయం
చర్చల్లో పాల్గోనేందుకు సైతం ఆర్థిక శాఖ ఉద్యోగులు రెండో బ్లాక్ నుంచి మూడో బ్లాక్ వరకూ నల్లబ్యాడ్జీలతో ర్యాలీగా వచ్చారు. ఆర్థికశాఖలో సీనియారిటీలను ఖరారు చేసే అంశంపై ప్రభుత్వం హామీ ఇచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని ఉద్యోగులు వాపోయారు. మరోవైపు ఆర్ధిక శాఖ ఉద్యోగులతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చర్చలు జరిపారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి