ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NTR: తహసీల్దార్ ఆఫీసులో తారక్.. ఎందుకొచ్చారో తెలుసా? - తెలంగాణ వార్తలు

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. రిజిస్ట్రేషన్ పనుల కోసం ఆయన వెళ్లారు. కాగా అక్కడి ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

film actor ntr at shankarpally tahsildar office
తహసీల్దార్ ఆఫీసులో తారక్.. ఎందుకొచ్చారో తెలుసా?

By

Published : Jul 31, 2021, 4:18 PM IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర షూట్‌తో ఫుల్‌ బిజీగా ఉన్న తారక్‌ తాజాగా.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో సందడి చేశారు. ఆయన రాక పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. శంకర్‌పల్లి మండలం పరిధిలోని గోపాలపురంలో తారక్‌ ఇటీవల ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ భూమి రిజిస్ట్రేషన్‌ పనుల కోసం ఆయన శుక్రవారం మధ్యాహ్నం శంకర్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్‌ రాకతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.

కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తైన వెంటనే కొంతమందితో ఫొటోలు దిగిన ఆయన హైదరాబాద్‌కు పయనమయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో తారక్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే ఆయన కొరటాల శివతో ఓ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు, ‘అరవింద సమేత’ తర్వాత తారక్‌-త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా ఓకే అయిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:

RRR: 'దోస్తీ' పాట వచ్చేస్తోంది.. సిద్ధంకండి

ABOUT THE AUTHOR

...view details