పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 275వ రోజుకు చేరుకున్న సందర్భంగా.. అన్నదాతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వెలగపూడిలో రైతులు, మహిళలు మానవహారం నిర్వహించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. కృష్ణాయపాలెంలో.. ముఖ్యమంత్రి జగన్ను రైతు అమరావతి వైపు తీసుకొస్తున్నట్లు ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది.
అమరావతే ఆశగా... రాజధాని సాధనే శ్వాసగా రైతుల ఉద్యమం
అమరావతే ఆశగా... రాజధాని సాధనే శ్వాసగా అన్నదాతలు ఉద్యమం చేస్తున్నారు. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 275వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కర్షకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
మందడంలో రైతులు ప్రధాని మోదీ మాస్కులు ధరించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ.. మోదీ మాస్క్ ధరించిన వ్యక్తికి విన్నవించారు. శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర హిందూ మహాసభ అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ రైతులకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్నారు. త్వరలోనే రైతులు తీపి కబురు వినబోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో తప్పుడు కేసులు వేస్తుందని రైతులు విమర్శించారు.
ఇదీ చదవండీ... సమయం చెప్పండి... నేనే వస్తా: ఎంపీ రఘురామకృష్ణరాజు