ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ పొదిలె అప్పారావు పదవీ కాలం పొడిగిస్తూ... రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పరిస్థితులు, విద్యా సంవత్సరం గాడిన పెట్టడం వంటి కారణాలతో అప్పారావు పదవీకాలం పొడిగించినట్లు తెలుస్తోంది.

extension-of-tenure-of-hcu-vc-apparao
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవీకాలం పొడిగింపు

By

Published : Sep 22, 2020, 10:15 PM IST

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ పొదిలె అప్పారావు పదవీ కాలం పొడిగిస్తూ... రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఏడాది పాటు లేదా కొత్త వీసీని నియమించే వరకు అప్పారావును కొనసాగించాలని రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ హెచ్​సీయూకీ తెలిపింది.

హెచ్​సీయూ వీసీగా 2015 సెప్టెంబరులో నియమితులైన అప్పారావు పదవీకాలం నేటితో ముగిసింది. వీసీ పదవి కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా పరిస్థితులు, విద్యా సంవత్సరం గాడిన పెట్టడం వంటి కారణాలతో అప్పారావు పదవీకాలం పొడిగించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండీ... శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details