CRDA: అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 30 వరకూ పొడిగిస్తూ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రకటన జారీ చేసింది. రాజధాని పరిధిలో మొత్తం 17,700 మంది అర్హులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉందని అయితే ఇప్పటివరకూ 929 మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్లాట్లు పొందారని సీఆర్డీఏ కమిషనర్ వెల్లడించారు. మిగిలిన రైతులు కూడా తమ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కోరారు.
రెసిడెన్షియల్‌లో 555 మంది, వాణిజ్య ప్లాట్లకు సంబంధించి 374 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. రైతుల సౌలభ్యం కోసం నెలాఖరు వరకు గడువు పొడిగించినందున మిగిలిన రైతులూ త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ల కోసం అర్హులకు పూర్తి సమాచారాన్ని అందించి.. జూన్ 10లోగా నోటీసుల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను, కాంపిటెంట్ అథారిటీలను ఆదేశించారు.
ఇవీ చూడండి