ముఖ్యమంత్రి జగన్‌తో జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సమావేశమైంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసింది. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై కమిటీ.. తన దృష్టికి వచ్చిన అంశాలను వివరిస్తోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది.
ముఖ్యమంత్రితో నిపుణుల కమిటీ భేటీ.. నివేదిక అందజేత! - expert commity met cm jagan
రాష్ట్రంలో ప్రాజెక్టులు, రాజధాని నగరంపై.. నిపుణుల కమిటీ.. ముఖ్యమంత్రి జగన్ ను కలిసింది. ఈ విషయాలపై నివేదిక సమర్పించింది. నివేదికలో ఏం ఉందంటే?
రాజధానితో పాటు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన జీఎన్ రావు కమిటీ ప్రభుత్వ సూచనల మేరకు అధ్యయనం చేసింది. అన్ని ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. విశాఖ, కర్నూలు, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధిని పరిగణలోకి తీసుకుంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 40వేలకు పైగా వినతులను పరిశీలించి నివేదిక రూపొందించింది. ఆ వివరాలనే ఇప్పుడు ముఖ్యమంత్రికి అందించింది.
రాష్ట్రానికి 3 రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనతో.. ఇప్పటికే అమరావతి ప్రాంతమంతా సమరావతిగా మారింది. రాజధాని పరిధిలోని రైతులు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. అధికార వైకాపా మినహా.. ఇతర పార్టీలన్నీ రైతులకు సంఘీభావం తెలిపాయి. ఇలాంటి తరుణంలో.. జీఎన్ రావు కమిటీ.. తన నివేదికలో ఏం చెప్పింది? ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉండబోతోంది? రాజధానిగా అమరావతి భవితవ్యం ఏంటన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.