ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PTD EMPLOYEES: పీటీడీ ఉద్యోగులకు సీపీఎస్‌ అమలుకు కసరత్తు - ఏపీ లేటెస్ట్ న్యూస్

ప్రజా రవాణాశాఖ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌) అమలుకు కసరత్తు ఆరంభించారు. ఇందుకు ఏయే విధివిధానాలు పాటించాలో తెలపాలని కోరుతూ... ఆర్టీసీ ప్రభుత్వానికి లేఖ పంపింది.

exercise-for-cps-implementation-for-ptd-employees
పీటీడీ ఉద్యోగులకు సీపీఎస్‌ అమలుకు కసరత్తు

By

Published : Oct 22, 2021, 8:49 AM IST

విలీనంతో ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఉన్న పాత పింఛన్‌ విధానం తమకూ వర్తిస్తుందని ఎదురుచూస్తున్న ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) సిబ్బంది ఆశలు నెరవేరే అవకాశం కనిపించడంలేదు. వీరికి కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌) అమలుకు కసరత్తు ఆరంభించారు. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్‌-95 పింఛను పథకానికి బదులు సీపీఎస్‌లో చేరే అవకాశం కల్పించనున్నారు.

ఇందుకు ఏయే విధివిధానాలు పాటించాలో తెలపాలంటూ ఆర్టీసీ యాజమాన్యం ఓ దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపింది. దీనిని ఆర్థికశాఖ పరిశీలిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చిన తర్వాత.. ఈపీఎఫ్‌-95లో కాకుండా సీపీఎస్‌లో చేరాలనుకునే ఉద్యోగులకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి:Remand: తెదేపా నేత పట్టాభికి నవంబరు 2 వరకు రిమాండ్‌

ABOUT THE AUTHOR

...view details