ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏవోబీ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు.. తప్పించుకున్న మావోయిస్టులు - ఏవోబోలో ఎదురుకాల్పులు

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో మావోలు తప్పించుకున్నారు. 303 తుపాకులతో పాటు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని కూంబింగ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

andhra odisha border
andhra odisha border

By

Published : Jul 17, 2020, 12:35 AM IST

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మావోయిస్టులు తప్పించుకోగా.. వారికి చెందిన 303 తుపాకులతో పాటు పెద్దఎతున పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒడిశాకు చెందిన కూంబింగ్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఆంధ్రాకు ఆనుకుని ఉన్న చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసపుట్టు పంచాయతీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువైపులా 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఒకదశలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. వారంతా.. ఆంధ్రాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు... బలగాలను మోహరిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details