ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీఏ అధికారులపై కేసు ఎందుకు పెట్టలేదు?: జేసీ

కక్షసాధింపు చర్యల్లో భాగంగానే.. తన తమ్ముడు జేసీ దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఎన్ని తప్పుడు కేసులు బనాయించిన పార్టీ మారే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

ex-mp-jc-diwakar-reddy
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

By

Published : Jun 13, 2020, 11:00 PM IST

రాష్ట్రంలో ఉన్న వైకాపా పార్టీ కక్షసాధింపు పార్టీ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులపై స్పందించిన ఆయన.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలేనన్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే అధికారులు కేసులు పెట్టారన్నారు. వైకాపాకు వ్యతిరేకంగా పనిచేసినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

పార్టీని వీడేది లేదు...వైకాపాలో చేరేది లేదు: జేసీ

రాష్ట్రంలో పాలన నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు సాగుతోందన్నారు. తుగ్లక్ కూడా ఇలా పరిపాలన చేయలేదని...ఇలాంటి సీఎంను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆర్థికంగా దెబ్బతీయాలనే ఇలాంటివి చేస్తున్నారని...మమ్మల్ని రోడ్డు మీదకు ఈడ్చాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని జేసీ విమర్శించారు. తాము ఇబ్బంది పడినా డ్రైవర్లకు జీతాలు ఇచ్చామని జేసీ తెలిపారు. ఏది ఏమైనా పార్టీని వీడేది లేదని... వైకాపాలో చేరేది లేదన్నారు.ముందుముందు మమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టవచ్చని... రేపో మాపో తనను కూడా లోపల వేయవచ్చని జేసీ వ్యాఖ్యానించారు.

వారిపై ఎందుకు కేసు పెట్టలేదు..?

వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులపై ఎందుకు కేసు పెట్టలేదని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. అదే విధంగా నాగాలాండ్ ఆర్టీఏ అధికారులపై ఎందుకు కేసు పెట్టలేదని... తుక్కు వాహనాలకు ఇంజిన్‌, టైర్లు బిగించి ఎందుకు విక్రయించారని జేసీ ప్రశ్నించారు. తప్పు చేసి ఉంటే ప్రభాకర్‌ రెడ్డిని 6, 7 నిందితుడిగానో పెట్టాలి కానీ 1 నిందితుడిగా ఎలా పెడతారన్నారు. వాహనాలు విక్రయించిన, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్లందరిని వదిలేసి కక్షతోనే తమ్ముడిని, కుమారుడిని అరెస్టు చేశారన్నారు. కోర్టులే తమను రక్షిస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఏజెంట్‌ ముత్తు ద్వారానే వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు.

జేసీ కుటుంబానికి చెడ్డపేరు తేవడానికే ఇదంతా..: జేసీ పవన్

నాగాలాండ్‌ అనుమతి ఇస్తేనే తాము వాహనాలు కొన్నామని జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ అన్నారు. నకిలీ పత్రాలతో మోసం చేస్తున్నారనే నాగాలాండ్‌లో ఫిర్యాదు చేశామని... ఫిర్యాదు చేసిన మాపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. జేసీ కుటుంబానికి చెడ్డపేరు తేవాలని ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు పట్టుకున్న లారీలు జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరు మీద లేవని....కక్ష సాధింపు తప్ప ఈ కేసులో ఎలాంటి బలం లేదన్నారు. ఇది హిట్లర్ పాలన, మీరు చేసిన దానికి ప్రతిఫలం ఉంటుందని పవన్‌ హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం, వెనక్కి తగ్గేదే లేదన్నారు.

ఇవీ చదవండి:

జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. జిల్లా జైలుకు తరలింపు

ABOUT THE AUTHOR

...view details