భాజపా నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూశారు. జులై మొదటి వారంలో కరోనా బారిన పడ్డ ఆయన... వెంటనే ఏలూరులోని ఆశ్రమ కోవిడ్ కేంద్రంలో చేరారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ హెల్ప్ ఆస్పత్రికి తరలించారు.
9 రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న మాణిక్యాలరావు .. అనారోగ్య సమస్యలు చుట్టిముట్టి తుదిశ్వాస విడిచారు. రెండ్రోజులుగా ఆరోగ్యం పూర్తిగా విషమించిందని... పచ్చకామెర్లు, ఊపిరితిత్తుల సమస్యతో పాటు.... బీపీ హెచ్చుతగ్గులతో తుదిశ్వాస విడిచారని వైద్య బృందాలు తెలిపాయి.
ప్రస్థానం..
- 1961 నవంబర్ 1న తాడేపల్లిగూడెంలో పైడికొండల మాణిక్యాలరావు జననం
- తాడేపల్లిగూడెంలో పాఠశాల విద్య, పెంటపాడులో కళాశాల విద్య అభ్యాసం
- పైడికొండల మాణిక్యాలరావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు
- తెదేపా-భాజపా కూటమి అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక
- తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నిక
- 2014లో తెదేపా ప్రభుత్వంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు
- చిన్నప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన మాణిక్యాలరావు
- 9 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరిన మాణిక్యాలరావు
- భాజపా ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్న మాణిక్యాలరావు
- ఫొటోగ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మాణిక్యాలరావు
- ఫోటోస్టూడియో మూసివేసి 'సింధు షూమార్ట్' ప్రారంభించిన మాణిక్యాలరావు
- సింధు ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చి ఆటోమొబైల్ విడిభాగాల విక్రయాలు చేసిన మాణిక్యాలరావు
- 2011-2013 వరకు మానవత సంస్థ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షునిగా సేవా కార్యక్రమాలు
- మానవత సేవా సంస్థ ద్వారా జిల్లాలోని పలు పట్టణాల్లో శీతల శవపేటికలు ఉచితంగా ఏర్పాటు