Swamy Goud: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు గండిపేట మండల పరిధిలో పార్టీ నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్, భాజపా నేత స్వామి గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కిస్మత్ పూర్లోని తన ఇంటికి వస్తుండగా రోడ్డు పైనున్న గుంతలలో బైక్ స్కిడ్ కావడంతో స్వామి గౌడ్ కింద పడిపోయాడు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కాగా బైక్‌పై నుండి పడటంతో కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా డాక్టర్లు తెలిపారు.
తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం - hyderabad latest news
Swamy Goud తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. గుంతలున్న రోడ్ల వలనే తనకు ప్రమాదం జరిగిందని.. స్వామిగౌడ్ అధికారులపై మండిపడ్డారు.
swamy goud
ఇవాళ్టి ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమై కారణమని స్వామి గౌడ్ మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు గండిపేట మండల పరిధిలో రోడ్లు పూర్తిగా గుంతలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయాన్ని అధికారులకు పలుమార్లు సూచించినప్పటికీ ఏ మాత్రం ఫలితం లేదని స్వామి గౌడ్ ఆరోపిస్తున్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: