- పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ
పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఎస్ఈసీ జారీ చేసిన ప్రోసిడింగ్స్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల సంఘం...హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌పై నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నందమూరి తారక రామారావు.. కాషాయం కట్టిన లౌకికవాది
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజా జీవితంలోకి వచ్చినా.. రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తిని, సమాఖ్య వ్యవస్థ అవసరాన్ని నొక్కిచెప్పి తనదైన ఒక సైద్ధాంతిక పునాదిని ఎన్టీఆర్ ప్రతిపాదించారు. రాజకీయాన్ని వృత్తిగా కాకుండా లక్ష్యసాధనకు మార్గంగా పరిగణించిన.. నందమూరి తారక రామరావు 25వ వర్థంతి నేడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒకరనుకొని మరొకరిపై కత్తితో దాడి.. చివరికి..!
గుంటూరు నగర శివారులో ఆదివారం ఉదయం చిత్రమైన ఘటన జరిగింది. మమ్మల్ని కారుతో గుద్ది ఆపకుండా వెళ్తావా.. అంటూ ఒకతను వచ్చి తీవ్రంగా కొట్టాడు. తర్వాత కత్తితో పొడిచాడు.. మళ్లీ పది నిమిషాల తర్వాత మరో ఇద్దరు వచ్చి చితకబాదారు.. చివరలో అరే నువ్వా.. నిన్ను కాదు కొట్టాల్సింది.. అంటూ సారీ చెప్పి చికిత్స కోసం రూ.వెయ్యి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అలిపిరి నడక మార్గంలో భక్తులను వెంబడించిన దొంగలు
అలిపిరి నడక మార్గంలో తమను దోచుకోవటానికి దొంగలు వెంబడించారని భక్తులు ఫిర్యాదు చేశారు. డయల్ 100కి సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే స్పందించి.. తమను రక్షించినట్లు భక్తులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహారాష్ట్రలో భూకంపం- భవనాలకు పగుళ్లు
మహారాష్ట్ర పాల్గఢ్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.5గా నమోదైనట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి