- వారిని తలుచుకుంటే భయమేస్తుందన్న పవన్
అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పదవి వెతుక్కుంటూ రావాలే గానీ పదవి వెంట పడకూడదన్న జనసేనాని.. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా రావాలని అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన జనసేన ఐటీ ప్రతినిధుల ముగింపు సమావేశంలో పవన్ ప్రసంగించారు.
- weather బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంలో వర్షాలు
బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం అర్ధరాత్రికి పశ్చిమ బెంగాల్ తీరంలోని దిఘాకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
- నాపై ప్రచారం చేస్తే పాత మాధవ్‌ను చూస్తారన్న ఎంపీ గోరంట్ల
ఫేక్ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. హైదరాబాద్ నుంచి అనంతపురం బయల్దేరిన ఎంపీ మాధవ్‌కు కురువ సంఘం నాయకులు కర్నూలు సరిహద్దు టోల్గేట్ వద్ద స్వాగతం పలికారు.
- తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి దర్శనానికి 40 గంటలు
Tirumala వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్మెంట్లు నిండి బయటి వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటలు పడుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము, వారిపై ప్రశంసలు
Draupadi Murmu Address Nation భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారని అన్నారు ముర్ము. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని అభిప్రాయపడ్డారు.
- మహారాష్ట్రలో భాజపాకే కీలక శాఖలు, హోం, ఆర్థిక మంత్రిగా ఫడణవీస్
MAHARASHTRA CABINET EXPANSION మహారాష్ట్రలో మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే శాఖలను కేటాయించారు. భాజపా నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు హోం, ఆర్థిక శాఖలు దక్కాయి.
- బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఝున్‌ఝున్‌వాలా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉదయం 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయిలోని బీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు.
- వసూళ్లలో తెలుగు కొత్త సినిమాల దూకుడు, అమెరికాలో ప్రభంజనం
టాలీవుడ్లో ఇటీవల విడుదలైన సినిమాలు కలెక్షన్లలో దూసుకెళ్తున్నాయి. సీతారామం అమెరికాలో 1 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోయింది. బింబిసార, కార్తికేయ2 ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
- ఇంగ్లాండ్‌లో ఇరగదీస్తున్న పుజారా, వన్డేల్లో వరుసగా రెండో సెంచరీతో విధ్వంసం
Pujara Century భారత క్రికెటర్, టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ కప్ వన్డే ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టు తరఫున వరుసగా రెండో సెంచరీ చేయడం విశేషం.
- ఆ విషయంలో భారత్ అద్భుతమంటూ పాక్ మాజీ ప్రధాని ప్రశంసలు
Imran Khan Jaishankar news పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత్‌ను మరోసారి కొనియాడారు. ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందని మెచ్చుకున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడిన వీడియోను ఆయన బహిరంగ సభలో ప్లే చేశారు. ప్రస్తుత పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోతోందని, ఈ బానిసత్వానికి తాను వ్యతిరేకమని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.