- విశాఖ గీతం వర్సిటీకి చెందిన నిర్మాణాలు కూల్చివేస్తున్న రెవెన్యూ సిబ్బంది
విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద కొన్ని కట్టడాలను....రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. గీతం విశ్వవిద్యాలయం ప్రధానద్వారం, ప్రహరీగోడను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఉభయ రాష్ట్రాల అంగీకారం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరిలో నీటి వాటాను తేల్చేందుకు గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇందుకోసం తమ ప్రతిపాదనలు పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి కోరారు. ఈ విషయంలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ట్రైబ్యునల్ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదన పంపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తెలుగు రాష్ట్రాలకు పంపిన అపెక్స్ కౌన్సిల్ మినిట్స్‌లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోలవరం పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రం షరతు?
రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన... దిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యాక కూడా పోలవరం నిధులపై గట్టి హామీ లభించలేదని సమాచారం. 55వేల కోట్ల తొలి డీపీఆర్ కాకుండా, 20వేల కోట్లతో రెండో డీపీఆర్‌ను పీపీఏ ఆమోదిస్తేనే.... ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన 2వేల 234 కోట్లయినా వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఆర్థికశాఖ, జలవనరులశాఖ అధికారులతో సీఎం జగన్ నేడు చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంటర్ సీటు దక్కేదెలా?
ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల్లో తాము కోరుకునే కళాశాలలో సీట్లు కనిపించకపోవటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఆసక్తి చూపే కళాశాలలు ఆన్లైన్లో కనిపించకపోవడంతో చాలా మంది కళాశాల ఎంపిక ఐచ్ఛికాలు ఇవ్వకుండా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముఫ్తీ 'జెండా' వ్యాఖ్యలపై భాజపా ఫైర్
జాతీయ జెండాపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి భాజపా, కాంగ్రెస్. కశ్మీర్ ప్రత్యేక జెండా తమ చేతికి వచ్చాకే.. త్రివర్ణ పతాకాన్ని ఎగురువేస్తామనటం.. దేశ ద్రోహమే అవుతుందని పేర్కొంది భాజపా. ముఫ్తీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని పేర్కొంది కాంగ్రెస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 35 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐఎల్ఓ పీఠం