- భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ
కాసేపట్లో భారత న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠాన్ని తెలుగుతేజం అధిష్టించబోతుంది. 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నేడు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం స్వీకారం చేయించనుండగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ... నేటి నుంచే అమలు
కరోనా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్రంలో...నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పది, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు యథాతథంగా జరపాలని స్పష్టంచేశారు. మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్టీసీ నిర్ణయం: రెండు సీట్లలో ఒకటి ఖాళీ.. స్లీపర్లోనూ సగం బెర్తులే..!
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్టీసీ మరిన్ని భద్రతాచర్యలు చేపట్టింది. ఏసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మాత్రమే ప్రయాణికులకు కేటాయించేలా ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రెండు సీట్లలో ఒకటి ఖాళీగా ఉంచనున్నారు. ఏసీ స్లీపర్‌లో కూడా సగం బెర్తులే కేటాయించేలా ఆదేశించారు. ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ సాఫ్ట్‌వేర్‌లో ఈమేరకు మార్పులు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆటోను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మిర్చి కూలీలు మృతి
ఆటోను కారును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోగా.. పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నందిగామ అడ్డరోడ్డు వద్ద జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దిల్లీ విలయానికి ఆ రకమే కారణమా..?
దిల్లీలో కొవిడ్ మహమ్మారి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. అయితే ఈ ఆకస్మిక ఉద్ధృతికి బ్రిటన్ రకం వేరియంట్ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండు, మూడు ఉత్పరివర్తనలున్నా టీకాకు ఢోకాలేదు!
కరోనా వైరస్ రోజుకో కొత్త రూపు దాలుస్తందంటూ వెలువడుతోన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఒక్కో రకానికి ఒక్కో టీకా తీసుకోవాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు రెండు, మూడు ఉత్పరివర్తనలున్న వైరస్‌లపై సమర్థంగానే పనిచేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు ఒక్క వైరస్‌లోనే ఆ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్ డైరెక్టర్ సౌమిత్ర దాస్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'వాతావరణ లక్ష్యాన్ని కలిసి సాధిస్తాం'
గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను అరికట్టడానికి, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి తమ శాయశక్తులా కృషి చేస్తామని అమెరికా సహా అరడజను దేశాలు హామీఇచ్చాయి. దాదాపు 40 దేశాల నేతలు, సంఘాలు, వాణిజ్య ప్రతినిధులు పాల్గొన్న రెండ్రోజుల వర్చువల్ సదస్సును బైడెన్ శుక్రవారం సాయంత్రం ముగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బోటు మునిగి 130 మంది మృతి!
ఆఫ్రికా లిబియా తీరంలో బోటు మునిగింది. ఈ ఘటనలో ఐరోపాకు చెందిన 130 మంది అక్రమ వలసదారులు మృతిచెందినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్‌లో సచిన్‌కు స్వర్ణం
ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్‌లో పురుషుల 56 కేజీల విభాగంలో సచిన్ స్వర్ణం సాధించాడు. దీంతో మొత్తం ఎనిమిది స్వర్ణాలు, మూడు కాంస్యాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్స్‌ను ముగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ అదృష్టం ఇప్పుడు నాకు వచ్చింది: పరిణీతి
కరోనా ప్రభావమున్నా సరే వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది హీరోయిన్ పరిణీతి చోప్రా. తనకు చేతినిండా పని ఉండటం అదృష్టమని భావిస్తున్నట్లు ఈమె తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.