- 570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం: ఎస్ఈసీ
నగర పాలక, పురపాలిక, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అదానీ చేతికి గంగవరం పోర్టు?
ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టు అదానీ గ్రూపు చేతికి వెళ్లిపోనుంది. వార్‌బర్గ్ పింకస్ అనే విదేశీ సంస్థ అధీనంలోని 31.5% వాటాను 19వందల 54 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకొంది. ఫలితంగా.. గంగవరం పోర్ట్ కంపెనీలో 16.3 కోట్ల షేర్లు అదానీ సంస్థ చేతికి రానున్నాయి. ఒక్కో షేరును 120 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఇంటి ఆకృతిపై అభ్యంతరం చెప్పం.. '
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదల కోసం చేపట్టే ఇళ్ల నిర్మాణంలో ఆకృతి నిబంధనను ప్రభుత్వం సడలించింది. ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలంటే ప్రతిపాదిత నమూనాయే ఉండనున్నట్లు స్పష్టం చేసింది. నిర్మించుకునేవారు తమ ఇష్ట ప్రకారమే కట్టుకునే వెసులుబాటు కల్పించింది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నల్ల పసుపు, గోధుమ- ఒడిశా వాసి అరుదైన పంట
ఒడిశా రాష్ట్రానికి చెందిన దివ్యరాజ్ బెరిహా అరుదైన పంటలను సాగు చేస్తున్నారు. అంతరించిపోతున్న స్థితిలో ఉన్న నల్ల రకం గోధుమ, పసుపును పండించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తి రీత్యా బొటానికల్ శాస్త్రవేత్త అయిన దివ్యరాజ్.. ఇటువంటి అరుదైన రకాలను కాపాడటమే తన లక్ష్యమని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరిశోధనలే ప్రజారోగ్యానికి కీలకం