ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఆంధ్రప్రదేశ్ వార్తలు

.

5 pm top news
5 pm ప్రధాన వార్తలు

By

Published : Sep 19, 2020, 5:00 PM IST

  • పోలవరం బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదు
    పోలవరం ప్రాజెక్టు గురించి ప్రభుత్వం సమర్పించిన బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదని కేంద్రం పేర్కొంది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రాజెక్టు ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు సమర్పించిందని కేంద్రం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • వైకాపాలో చేరిన తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్​ కుమారులు
    విశాఖ దక్షిణ తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సీఎం జగన్​ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ భేటీలో వాసుపల్లి గణేష్ ఇద్దరు కుమారులను సీఎం జగన్ వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పేద వర్గాల కోసం జగన్ చేస్తున్న కృషిని చూసి తన కుమారులు వైకాపాలో చేరారని వాసుపల్లి గణేష్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కేసీఆర్​కు వైకాపా ప్రభుత్వం బినామీ
    తెలంగాణ సీఎం కేసీఆర్​కు వైకాపా ప్రభుత్వం బినామీగా వ్యవహరిస్తోందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్ర సంపద సృష్టి కేంద్రమైన అమరావతిపై వైకాపా ప్రభుత్వం ప్రతిరోజూ విషం కక్కుతూనే ఉందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కేంద్రం రూ.10 పెంచితే ఎవరికీ కనపడలేదు
    రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసమే పెట్రోలు, డీజిల్​పై పన్ను పెంచామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కేంద్రం రూ.10 పెంచితే లేని బాధ, తాము రూపాయి పెంచితే కొందరు బాధపడుతున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'శ్రామిక్​ రైళ్లల్లో 97మంది కూలీలు మృతి'
    కరోనా కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ సమయంలో శ్రామిక్​ ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణించిన వలస కార్మికులలో మొత్తం 97మంది మృతి చెందినట్లు పార్లమెంట్​ తెలిపింది. ఈ మేరకు ఓ రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చింది కేంద్రం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అక్రమ బాంబుల తయారీకి అడ్డాగా బంగాల్​: ధన్​ఖర్​​
    పశ్చిమ్​ బంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​​. రాష్ట్రంలో ఎన్​ఐఏ ఉగ్రవాదులు పట్టుబడిన అనంతరం.. 'బంగాల్​ అక్రమ బాంబుల తయారీకి అడ్డా'గా మారిందని ఆరోపించారు. దీదీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలే దీనికి కారణమని విమర్శించారు. ఎన్​ఐఏ ఇవాళ ఉదయం జరిపిన దాడుల్లో మొత్తం 9 మంది అల్​ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • క్రియాశీల రాజకీయాల్లోకి నవాజ్​ షరీఫ్ పునరాగమనం​!
    పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​.. ఏడాది తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా? తమ పార్టీకి పునరుజ్జీవం పోసేందుకు కసరత్తు చేపట్టారా? అంటే అవుననే చెప్పాలి. అందులో భాగంగానే ఆయన ఆదివారం నిర్వహించే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అమెరికాలో కాల్పుల కలకలం- ఇద్దరు మృతి
    అమెరికా న్యూయార్క్​ రాష్ట్రంలో అర్థరాత్రి కొందరు దుండగులు... స్థానికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. అయితే కాల్పులకు కారణం ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఐపీఎల్​లో మిగతా జట్లలానే చెన్నై కూడా: రోహిత్
    చెన్నై సూపర్​కింగ్స్​తో మ్యాచ్ అంటే ఎప్పుడు మజానే అని చెప్పిన రోహిత్ శర్మ.. అన్ని జట్లలానే చెన్నై కూడా ఒకటని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • తన ఇంటి ద్వారాలనే విరగ్గొట్టిన 'ది రాక్'​
    విద్యుత్​ అంతరాయంతో ఇంటి ద్వారాలు తెరుచుకోకపోవడం వల్ల డ్వేన్ జాన్సన్ ఇంటి ద్వారాలు తెరుచుకోలేదు. దీంతో వాటిని పగలగొట్టి బయటకు వెళ్లారు ఈ హాలీవుడ్ నటుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details