- సొంత పార్టీ ఎంపీపై స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
మీడియా సమావేశంలో తనపై వైకాపా ఎంపీ సురేశ్ తనను అసభ్యపదజాలంతో దూషించారని ఆరోపిస్తూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: గౌతమ్ రెడ్డి
రాష్ట్రంలో మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టులు పూర్తి చేసి ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభించామని మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. 8 ఫిషింగ్ జెట్టీలు నిర్మాణం కానున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'విస్తృత పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యం'
కర్నూలు జిల్లాలో కరోనా కేసులను త్వరగా గుర్తించడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తున్నామని... జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు తెలిపారు. ఇప్పటికే 5 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. గతంతో పోలిస్తే మౌలిక వసతులు బాగా మెరుగుపడ్డాయని, ప్రస్తుతం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా సంజీవని బస్సుల ద్వారా పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- అమరావతే ఆశగా... రాజధాని సాధనే శ్వాసగా రైతుల ఉద్యమం
అమరావతే ఆశగా... రాజధాని సాధనే శ్వాసగా అన్నదాతలు ఉద్యమం చేస్తున్నారు. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 275వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కర్షకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జీఎస్టీ బకాయిల కోసం విపక్షాల ధర్నా
రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను చెల్లించాలని కోరుతూ విపక్షాలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ఎదుట ధర్నాకు దిగారు. తృణమూల్ కాంగ్రెస్, తెరాస, ఆర్జేడీ సహా పలు ప్రాంతీయ పార్టీల సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వృద్ధి రేటుపై ఆందోళనలు- మార్కెట్లకు నష్టాలు