- ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటన
ప్రవేశ పరీక్షల తేదీలను మంత్రి సురేశ్ ప్రకటించారు. ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు నిర్వహించనున్నారో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- 'అచ్చెన్నాయుడిని ఏపీ ప్రభుత్వం చంపేసేలా ఉంది'
ఏపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్ధి పార్టీ నేతలపై వైకాపా తీరు విమర్శలకు తావిస్తోందని పేర్కొన్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏపీ ప్రభుత్వం చంపేసేలా ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- న్యాయకోవిదులు రైతుల పక్షాన నిలిచారు
ప్రముఖ న్యాయకోవిదులు అమరావతి రైతుల పక్షాన నిలిచారని అడ్వొకేట్ లక్ష్మీనారాయణ అన్నారు. ఇవాళ రాజధానిపై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు...స్టేటస్ కో ఈ నెల 27వరకు మరోసారి పొడిగించిందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ వాదనను పక్కనపెట్టిందని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉదయానంద హాస్పిటల్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్
కర్నూలు జిల్లాలోని ఉదయానంద హాస్పిటల్స్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఈ ఆస్పత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆగస్టు చివరి నాటికి 'ఏకే-203' రైఫిళ్ల ఒప్పందం!
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాతో ఏకే-203 రైఫిల్ కొనుగోలు ఒప్పందాన్ని భారత్ వేగవంతం చేస్తోంది. ఈ నెల చివరి నాటికి రెండు దేశాల మధ్య అంతర ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ) ఖరారయ్యే అవకాశం ఉంది. 2018లో ప్రతిపాదించిన ఈ ఒప్పందం.. ధర, సాంకేతిక బదిలీ అంశాల్లో విభేదాల కారణంగా మరుగున పడిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గజరాజుకు ప్రేమతో
కేరళకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తనదైన శైలిలో ఏనుగుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. దాదాపు 35 ఏళ్లుగా ఏనుగు వార్తా కథనాలను సేకరిస్తున్నారు. వాటి ద్వారా వేలాది మంది విద్యార్థులకు గజరాజులు ఎదర్కొంటున్న హింసను వివరిస్తున్నారు. ఏనుగుల సంరక్షణకు బాటలు వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- త్వరలో వివాహమా? ఈ ఆర్థిక ప్రణాళిక మీ కోసమే..
పెళ్లి.. ఇద్దరు మనుషులు ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండే ఓ అమూల్యమైన బంధం.పెళ్లయ్యాక భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఒకరిపై ఒకరికి ప్రేమ? అనురాగాలు ఎంత అవసరమో ఆర్థికంగా స్థిరంగా ఉండటం అంతే అవసరం. చాలా మందికి సరైన ఆర్థిక ప్రణాళిక లేనందుకే సమస్యల్లో చిక్కుకుంటుంటారు. మీరు త్వరలో పెళ్లికి సిద్ధమవుతుంటే.. దానికి ముందే ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ఉత్తమం. పెళ్లికి ముందే ఆర్థిక ప్రణాళిక ఎందకు అవసరం? దాని ఉపయోగమెంత? అనే విషయాలపై నిపుణుల సలహాలు, సూచనలు కావాలంటే క్లిక్ చేయండి.
- 'గల్వాన్ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయండి'
లద్దాఖ్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులను జవాబుదారీగా చేయాలని భారత్‌ను చైనా కోరింది. సైన్యంలో క్రమ శిక్షణ తీసుకురావాలని చెప్పుకొచ్చింది. గల్వాన్ తరహా ఘటనలు జరగకుండా చూడాలని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మేం సిద్ధమే.. పాక్ జట్టు మాత్రం చేతులెత్తేసింది'
2007 టీ20 ప్రపంచకప్ విశేషాలు గుర్తు చేసుకున్న భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. పాక్‌తో లీగ్ మ్యాచ్‌లో జరిగిన ఓ అనుహ్య పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు. అతను ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- థియేటర్లలోనే రవితేజ 'క్రాక్' సందడి
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'క్రాక్'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందని వార్తలు రాగా.. కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.