ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

.

By

Published : Nov 18, 2020, 1:00 PM IST

1 pm top news
1 pm ప్రధాన వార్తలు

  • గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ సమావేశం

గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్​తో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ముగిసింది. గవర్నర్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయిన ఎస్‌ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను గవర్నర్‌కు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫోన్​ చూస్తే తండ్రి తిడుతున్నాడని కుమారుడి కిడ్నాప్ డ్రామా...

ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని తండ్రి మందలించటం ఆ బాలుడికి నచ్చలేదు. తన తండ్రిని బెదిరించాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి దుకాణంలో పనిచేస్తున్న 17 ఏళ్ల గుమాస్తాతో కలిసి కిడ్నాప్ పేరిట డ్రామా ఆడాడు. అటు తల్లిదండ్రులను.. ఇటు పోలీసులను పరుగులు పెట్టించాడు. ఇంత చేసిన ఆ బాలుడి వయసు కేవలం 12 ఏళ్లే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జపాలీ తీర్థాన్ని దర్శించుకున్న సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ జపాలీ తీర్థాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో ఎన్నికలు వద్దంటున్నారు: యనమల

ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైకాపా వెనుకంజ వేస్తోందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైకాపా ఎందుకు చెబుతోందని ప్రశ్నించారు. బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనేదే వైకాపా భయమన్నారు. ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లో వ్యతిరేకత చూసే వెనక్కి తగ్గుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఖుష్బూకు తృటిలో తప్పిన ప్రమాదం

సినీనటి, భాజపా నాయకురాలు ఖుష్బూకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్‌ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌బెలూన్స్‌ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉత్తర భారతంలో వైభవంగా 'ఛఠ్​ పూజ'

సూర్యభగవానుడిని కొలుచుకునే ప్రత్యేక 'ఛఠ్​ పూజ' ఉత్సవాలు బిహార్​, ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రేదేశ్​​, సహా పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు నహయ్​-ఖాయ్​తో ప్రారంభమై నవంబర్​ 21న తెల్లవారు జామున ఉదయించే సూర్యుడికి పూజలు చేయటంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఛఠ్​ పూజ విశేషాలు తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • మారటోరియంతో లక్ష్మీ విలాస్​ షేర్లు భారీ పతనం

కేంద్రం విధించిన మారటోరియంతో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్లు బుధవారం కుప్పకులాయి. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈల్లో 20 శాతం వరకు పడిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ' ఆ దేశాలను కొవిడ్​ కూడా అడ్డుకోలేకపోయింది'

సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే విషయంలో కొన్ని దేశాలను కొవిడ్​-19 మహమ్మారి కూడా అడ్డుకోలేకపోయిందని ఐరాస వేదికగా వెల్లడించింది భారత్​. కరోనా మాటున మత ప్రాతిపదికన విభజన విద్వేషాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తున్నాయని స్పష్టం చేసింది. దీనిపై ఐరాస నిర్ణయాత్మకంగా మాట్లాడాలని, ఉగ్రవాదం ఏ విధంగా ఉన్నా సమర్థించకూడదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​తో​ సిరీస్​ ముంగిట ఆసీస్​కు ఎదురుదెబ్బ

భారత్​తో సిరీస్​ ముంగిట ఆస్ట్రేలియా జట్టుకు షాక్​ తగిలింది. ఆసీస్​ స్టార్​ పేసర్​ కేన్​ రిచర్డ్సన్​ పరిమిత ఓవర్ల మ్యాచ్​లకు దూరమయ్యాడు. తన భార్య నైకీ బాబుకు జన్మనివ్వడం వల్ల పర్యటన నుంచి తప్పుకున్నాడు కేన్. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు ధ్రువీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'హీరో భార్యలకు నచ్చక అవకాశాలు కోల్పోయా'

హీరోయిన్​గా కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అంటోంది బాలీవుడ్​ నటి తాప్సీ. తనను కథానాయికగా తీసుకోవడానికి కొంతమంది నిర్మాతలు ఇష్టపడేవారు కాదని పేర్కొంది. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన తాప్సీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details