ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 Am - తాజా తెలుగు వార్తలు

.

top news
11 Am ప్రధాన వార్తలు

By

Published : Jun 16, 2020, 11:07 AM IST

  • బడ్జెట్ 2020 - 21 ను ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి

శాసన సభలో ప్రవేశపెట్టే బడ్జెట్ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు.. సమావేశాలకు ముందు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. 2019–20 సప్లమెంటరీ బడ్జెట్‌ను.. 2020–2021 రాష్ట్రబడ్జెట్‌ను ఆమోదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నల్ల చొక్కాలతో అసెంబ్లీకు తెదేపా

అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కాలతో తెదేపా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు అసెంబ్లీకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సొంత అజెండా అమలుకే 2 రోజుల సమావేశాలు

2 రోజుల పాటే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెళ్లికి వెళ్లినా.. కేసులు పెట్టడమేంటి?: చినరాజప్ప

పెళ్లికి వెళ్లినందుకు తమపై కేసులు పెట్టడం జగన్‌ సర్కారు అరాచకానికి నిదర్శనమని తెదేపా సీనియర్‌ నేత చినరాజప్ప ఆరోపించారు. తనతో పాటు మరో సీనియర్‌ నేత యనమలపైనా కేసులు పెట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాతో దేశం గజగజ

భారత్​లో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాలుస్తూనే ఉంది. కేసులతో సహా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతూ పదివేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,667 కేసులు బయటపడ్డాయి. మరో 380 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చర్చలతోనే పరిష్కారం

చైనాతో సరిహద్దు వివాదం మరోస్థాయికి చేరకముందే భారత్ తెలివిగా అడుగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్​తో పోలిస్తే చైనా కనీసం రెండు దశాబ్దాలు ముందుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 75 శాతం కొత్త కేసులు ఆ దేశాల్లోనే

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు లక్షకు చేరుకోవటానికి 2 నెలల సమయం పట్టగా.. ప్రస్తుతం రోజుకు లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. అమెరికా, దక్షిణాసియాలోని 10 దేశాల్లోనే 75 శాతం కేసులు నమోదవుతున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బుల్ దూకుడు... భారీ లాభాల్లో సూచీలు

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న వ్యాపారాలకు 'ఫెడ్' ఉద్దీపన​ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపైన పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఖేల్​రత్నకు హిమదాస్ నామినేట్

భారత స్ప్రింటర్​ హిమదాస్​ను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్నకు నామినేట్ చేసింది అసోం రాష్ట్ర ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలతో మెరిసిందీ క్రీడాకారిణి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఏప్రిల్​లో ఆస్కార్ అవార్డుల వేడుక

కరోనా కారణంగా 93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న జరగాల్సిన ఈ వేడుకను ఏప్రిల్​ 25కు వాయిదా వేసింది ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్​ అండ్ సైన్సెస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details