ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

top ten news
టాప్ టెన్ న్యూస్

By

Published : Mar 13, 2021, 11:01 AM IST

  • స్థల వివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

శ్రీకాకుళం జిల్లాలో ఓ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వందశాతం ప్లేస్​మెంట్స్​తో విశాఖ ఐఐఎం సత్తా

విశాఖ ఐఐఎం విద్యార్థులు మ‌రోసారి సత్తా చాటుకున్నారు. 2020-22 బ్యాచ్ విద్యార్ధులు వంద శాతం వేస‌వి ప్లేస్​మెంట్​ల‌ను అత్య‌ధిక పారితోషికంతో ద‌క్కించుకున్నారు. 50 కంపెనీలు ప‌రిమిత కాలానికి పారితోషికంతో కూడిన ఉపాధిని క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తలలు పగిలేలా మొక్కులు.. అంతా భక్తిలో భాగమే!

ఆ ఊళ్లల్లో స్వామి వారికి మెుక్కులు చెల్లించుకునే విధానం చూస్తే.. ఒళ్లు జలదరిస్తుంది. చూడటానికి ఒకింత ఆశ్చర్యం.. ఒకింత భయం కూడా కలుగుతుంది. అయినా.. అదంతా భక్తిలో ఓ భాగమనే అంటారు ఆ గ్రామస్తులు. ఆ మొక్కులేంటి.. ఆ విశేషమేంటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • విజయవాడలో 'అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' ర్యాలీ

'అజాదీ కా అమృత్‌ మహోత్సవ్' లో భాగంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్‌ అహ్మద్‌, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు ర్యాలీలో పాల్గొన్నారు. యువత దేశ ఉన్నతి కోసం పాటుపడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య

బిహార్​లో దారుణం జరిగింది. సుపౌల్​లోని రాఘోపుర్​ గ్రామంలో.. ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడితో దంపతులు ఉరి వేసుకొని చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఏ పార్టీకైనా ఓటేయండి- భాజపాకు మాత్రం వేయకండి'

త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయవద్దని రైతు ఆందోళనలకు నేతృత్వం వహిస్తోన్న సంయుక్త కిసాన్​ మోర్చా బంగాల్​ ప్రజలను కోరింది. తద్వారా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న భాజపాకు గుణపాఠం నేర్పాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముడిచమురు ఎగుమతుల్లో ఆసియా దేశాలకు సౌదీ కోత

ముడి చమురు ఉత్పత్తి, సరఫరాదారు దేశాల్లో ప్రధానమైన సౌదీ అరేబియా తన ఎగుమతులను కుదించాలని నిర్ణయించింది. దీంతో ఆసియా దేశాలకు ముడిచమురు ఎగుమతుల్లో కోత పడనుంది. అయితే భారత్‌కు మాత్రం సరాసరిన నెలవారీ చమురు సరఫరా చేయనున్నట్లు సౌదీ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బైడెన్​ నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులకు ఊరట!

ట్రంప్​ హయాం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీసాదారులకు బైడెన్​ సర్కార్​ ఊరట కల్పించింది. వారి సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులకు ఉపశమనం లభించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ రికార్డులో బుమ్రాను అధిగమించిన చాహల్​

టీ20ల్లో టీమ్​ఇండియా స్పిన్నర్ చాహల్ కొత్త రికార్డు సాధించాడు. పొట్టి క్రికెట్​ ఫార్మాట్​లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా తొలి స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానంలో బుమ్రా కొనసాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముంబయి నగర వీధుల్లో బాలీవుడ్ తారలు.. లుక్కేయండి!

బాలీవుడ్ తారలు వీకెండ్​ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరు ముంబయి నగర వీధుల్లో సందడి చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు డైసీ షా అందేరీలోని హార్డ్ రాక్ కేఫ్​లో ప్రత్యక్షమయ్యారు. అలాగే యువ హీరో కార్తీక్ ఆర్యన్ జుహూలోని ఐ థింక్ ఫిట్​నెస్ సెంటర్​లో కసరత్తులు చేశారు. వీడియో కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details